కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో విళయతాండవ చేస్తోంది. ఇటలీ, స్పెయిన్ ఇప్పటికే దీని కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్యలో ఈ రెండు దేశాల్లోనే కరోనా వైరస్ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పటికీ అక్కడ వేలల్లో చనిపోతూనే వున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితిని అగ్రరాజ్యం అమెరికా ఎదుర్కొంటోంది. లక్షకు పైగా అక్కడ మరణాలు ఖాయమని ఆర్మీని శవాలని ప్యాక్ చేసే కవర్ బ్యాగ్లని అర్డర్ చేశారట.
ఇదిలా వుంటే కరోనాపై ఫేక్ న్యూస్‌ల పరంపర ఎక్కువైపోయింది. ఎక్కడో దొరికిన వీడియోకు సొంత పైత్యాన్ని జోడించి మరో సంఘటన అంటూ సైకోలు ఫేక్ న్యూస్‌లు పుట్టిస్తున్నారు. తాజాగా మలయాళ హీరో మోహన్‌లాల్‌పై కేరళలో ఓ రూమర్‌ని పుట్టించారు. మోహన్‌లాల్‌కు ఏకంగా కరోనా వైరస్ సోకిందని, దీని కారణంగా మోహన్‌లాల్ చనిపోయారంటూ తప్పుడు వార్తల్ని పుట్టించారు. ఓ ఫేక్ వీడియోని తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో వదలడంతో కేరళలో కలకలం చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు మోహన్‌లాల్‌పై ఫేక్ వీడియోని పుట్టించిన వారి కోసం గాలిస్తున్నారు. ఎవరైనా ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తే కఠనంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేక్ వార్తలపై సీరియస్‌గా యాక్షన్ తీసుకోమని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారిచేయడంతో కేరళలో పోలీసులు ఫేక్ వార్తల్ని పుట్టించే వారిని టార్గెట్ చేసినట్టు తెలిసింది.