మెగా డాట‌ర్ రెచ్చిపోయి ర‌చ్చ చేసింది!

కొంత మందికి ఫ్యామిలీ బ‌లంగా మారుతుంది. కానీ కొంత మందికి అదే ఫ్యామిలీ ఇబ్బందిగా మారుతుంది. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితినే మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాల‌ని, అంద‌రి హీరోయిన్‌ల తర‌హాలోనే అన్ని ర‌కాల చిత్రాల్లో రొమాంటిక్‌గా అయినా స‌రే న‌టించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది కానీ ఆ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌డం లేదు.

దీనికితోడు అవ‌కాశాలు ఇవ్వాల‌నుకున్న వాళ్లు కూడా మెగా ఫ్యామిలీ.. రెగ్య‌ల‌ర్ హీరోయ‌న్ క్యారెక్ట‌ర్ ఇస్తే చిరంజీవి నుంచి మెగా ఫ్యామిలీ హీరోలంతా ఏమంటారో అని భ‌యం.. ఆ భ‌యంతో నిహారిక‌కు ఛాన్స్ ఇవ్వాలంటే భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఆ భ‌యం పోగొట్ట‌డం కోసం నిహారిక కొత్త ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లు పెట్టింది.

హాట్ హాట్ ఫొటోల‌కి పోజులిచ్చి త‌ను ఎలాంటి పాత్ర‌కైనా సిద్ధ‌మ‌నే సంకేతాల్ని అందించింది. తాజాగా త‌న డ్యాన్స్ టాలెంట్‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్సింగ్‌డే సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టింది. డ్యాన్స్ మాస్ట‌ర్ య‌శ్వంత్‌తో క‌లిసి నిహారిక చేసిన ఈ వీడియో ఇన్ స్టా వేదిక‌గా ర‌చ్చ చేస్తోంది. ఇప్ప‌టికైనా ఈ వీడియో చూసైనా నిర్మాత‌లు , ద‌ర్శ‌కులు నిహారిక‌ని రెగ్య‌ల‌ర్ హీరోయిన్‌గా ట్రీట్ చేసి అవ‌కాశాలిస్తారేమో చూడాలి.