కమెడియన్‌లు దర్శకులుగా మారడం ఆ తరువాత చేతులు కాల్చుకోవడం తెలిసిందే. వెన్నెల కిషోర్ కమెడియన్‌గా రాణిస్తూనే దర్శకుడిగా మారి వెన్నెల వన్ అండ్ హాఫ్, `జఫ్పా` వంటి కళా కండాలు తీశాడు. ఈ రెండు చిత్రాలు అత్యంత దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ దారుణ ఫలితాల తరువాత మళ్లీ డైరెక్షన్ చేసే సాహసం చేయలేదు.
`గీతాంజలి` సినిమాతో హీరోగా మారిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా `భాగ్యనగర వీధుల్లో తమ్మత్తు` చిత్రంతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయాడు. వీళ్లకి ముందు చాలా మంది కమెడియన్‌లు దర్శకులుగా ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇదే జాబితాలో మరో కమెడియన్ సత్య దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.
`సినిమాలు చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం నా దృష్టంతా నటనవైపే వుంది. నటుడిగా పూర్తి స్థాయిలో స్థిరపడిన తరువాత నటనని కొనసాగిస్తూనే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని వుంది` అని సత్య చెబుతున్నాడు. `స్వామిరారా` సినిమాతో గుర్తింపుని తెచ్చుకున్న సత్య ప్రస్తుతం రామ్ నటిస్తున్న `రెడ్`, సాయిధరమ్‌తేజ్ `సోలో బ్రతుకే సోబెటర్`, శర్వానంద్ `శ్రీకారం` చిత్రాతో పాటు గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.