మహానటి మూవీతో ఇటు తెలుగు, అటు తమిళనాట తన అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది హీరోయిన్ కీర్తి సురేష్. సావిత్రి క్యారెక్టర్ తనకి తప్ప మరే హీరోయిన్ కి సూట్ అయ్యేది కాదేమో అనేట్టుగా ఆ పాత్రలో ఇమిడిపోయింది కీర్తి. కొన్ని సీన్లలో అయితే అచ్చు సావిత్రిలానే అనిపించింది. ఇక మహానటి ద్వారా వచ్చిన క్రేజ్ తో వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి ఈ నటికి. కానీ అమ్మడుకి ముద్దంటే చేదంట. అందుకే అలాంటి సీన్లలో నటించదట.
కానీ తనకి వచ్చే స్టోరీస్ అన్నిటిలోనూ ముద్దు సీన్లు ఉంటున్నాయట. ఈ కారణం చేతనే సినిమాలు ఒప్పుకోవట్లేదు ఈ బొద్దు గుమ్మ. ముద్దు సీన్లలో నటించను అని గతంలో కూడా దర్శకులకు చెప్పింది. అంతకుముందు ఎవరూ అలా చేయమని అడగలేదట. ఈమధ్యనే స్టార్ట్ చేశారట. ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదని వాపోతుంది. ఎలాగైనా ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారట కానీ అలాంటి సీన్లలో నటించటానికి తాను సిద్ధంగా లేనని నిర్మొహమాటంగా చెప్పేసిందట కీర్తి సురేష్.