ముంబై వీధుల్లో రౌడీ హ‌ల్‌చ‌ల్‌!

ముంబై వీధుల్లో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. అర్థ్ర రాత్రి హీరోయిన్ అన‌న్యా పాండేతో క‌లిసి బైక్‌పై షికార్లు చేస్తున్నారు. ఈ రౌడీ హంగామా అంతా ఆఫ్ ద స్క్రీన్ కోసం కాదండోయ్ ఆన్ స్క్రీన్ కోస‌మే. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ పాన్ ఇండియా లెవెల్లో `ఫైట‌ర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

క‌ర‌ణ్‌జోహార్‌తో క‌లిసి పూరిజ‌గ‌న్నాథ్‌, చార్మి ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబై వీధుల్లో జ‌రుగుతోంది. విజ‌య్ దేర‌వ‌కొండ‌, హీరోయిన్ అన‌న్యా పాండే పాల్గొన‌గా కీల‌క ఛేజింగ్ సీన్‌ల‌ని పూరి అర్థ్ర‌రాత్రి చిత్రీక‌రిస్తున్నారు. ఈ ఛేజింగ్ సీన్‌లో అన‌న్యతో కూడా పూరి విన్యాసాలు చేయిస్తుండ‌టం ఆక‌ట్టుకుంటోంది. ఈ స‌న్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. తాజా షూటింగ్‌కి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఓ అభిమాని ఈ ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఇవి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

అన‌న్య పాండే బైక్ వెన‌కాల‌, ఆ త‌రువాత స‌న్నివేశాల్లో ట్యాంక్‌పై కూర్చున్న పిక్స్ ఆస‌క్తిక‌రంగా వున్నాయి.
విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది.