రాజేంద్రప్రసాద్ వర్సెస్ జయసుధ.. వీరిద్దరి మధ్య మా అధ్యక్ష పదవి కోసం జరిగిన రచ్చ `మా`లో ఎంత రాజకీయం వుందో సామాన్య జనానికి అర్థమయ్యేలా చేసింది. రాజకీయాల్లోలా అభ్యర్ధిపై తిట్ల పురాణం, అర్హత, వయసు, కామన్ సెన్సు… వగైరా వగైరా.. ఇలాంటి పదాలతో రాజేంద్రప్రసాద్‌ని మీడియా ముఖంగా జయసుధ విమర్శించడంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. రాజేంద్రప్రసాద్ `మా` అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కోసం మంత్రి తలసాని తెరవెనుక మంత్రాంగం నడపాల్సి వచ్చింది.
అంటే `మా` ఏ స్థాయిలో రాజకీయ రంగు పులుముకుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచే `మా`లో అసలు వీధిపోరాటాలు మొదలయ్యాయి. ఆ తరువాత టర్మ్‌లో శివాజీరాజా అధ్యక్షుడు కావడం.. శ్రీరెడ్డి వివాదంతో అతనికి మెగా క్యాంప్ దూరం కావడం.. వంటి కారణాలతో మళ్లీ అధ్యక్షుడిగా శివాజీరాజా గెలవలేకపోయాడు. శ్రీరెడ్డి వివాదం, శివాజీరాజా సమయస్ఫూర్తితో స్పందించకపోవడం వల్లే జరిగిందని నరేష్ ఫోకస్ చేయడంతో అంతా అధ్యక్షుడిగా అతన్ని సపోర్ట్ చేశారు. అధ్యక్షుడిగా పీఠం ఎక్కడానికి కొన్ని గంటల ముందే నరేష్ తన బుద్ధి చూపించాడు. సభ్యులు మాట్లాడుతుంటే మైకులు లాక్కోవడం, మాట్లాడనివ్వకుండా చేయడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.
మళ్లీ రచ్చ మొదలైంది. హేమ తనని మాట్లాడనివ్వడం లేదని మీడియా సాక్షిగా నరేష్‌పై విమర్శలు చేసింది. దానికి రాజశేఖర్, జీవిత సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి చిలువలు పలువలుగా సాగుతున్న `మా స్టోరీ నెవ్వర్ ఎవ్వర్ ఎండింగ్ స్టోరీగా ఒక డైలీ సీరియల్‌లా సాగుతూనే వుంది. 41 డేస్ అందు బాటులో లేకపోతే యాక్టింగ్ అధ్యక్షుడిగా బెనర్జీని నియమించడం మరీ విడ్డూరంగా వుంది. యాక్టింగ్ అధ్యక్షుడుగా వుండటం బెనర్జీకి అవసరమా అని సెటైర్లు వినిపిస్తున్నాయి. దీంతో 900 మంది వున్న `మా` పరువు బజారున పడింది. ఇంకా ఈ రచ్చ ఎంత కాలం కంటిన్యూ అవుతుందో వాళ్లకే తెలియాలని ఇండస్ట్రీ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.