ప్రభాస్ స్నేహితులను, అభిమానులను అందరిని డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. తనని కూడా అందరూ డార్లింగ్ అనే పిలుచుకుంటారు అభిమానంతో. ప్రభాస్ వ్యవహారశైలి తారతమ్యాలు లేకుండా అందరితో ఒకేలా ఉంటుందని తహనై అత్యంత దగ్గరగా చూసేవాళ్ళు చెప్పే మాట. బాహుబలిలాంటి హిట్ వచ్చాక ప్రభాస్ బిహేవియర్ లో తేడా వస్తుందేమో అనుకున్నారట కానీ అలా జరగలేదు. ఎప్పుడూ హీరోలకుండే పొగరు చూపించడు ఇతనేమి హీరో అంటూ చమత్కరించారు కూడా కీరవాణి. తను ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు అనే స్వభావాన్ని మరొక్కసారి రుజువు చేసుకున్నాడు ప్రభాస్ అదిరే అభితో తను మెలిగిన తీరుతో.
అదిరే అభి బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఒక చిన్న వేషం కూడా వేసాడు అందులో. ఆ సమయంలో తనకి ప్రభాస్ కి మధ్య జరిగిన ఒక ఇన్సిడెంటును గుర్తు చేసుకున్నాడు అభి ఒక ఇంటర్వ్యూలో. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు అభి. దాదాపు 15 ఏళ్ళ తర్వాత బాహుబలి షూటింగులో కలిశారట వీరిద్దరు. అభిని చూసిన ప్రభాస్ డార్లింగ్ అంటూ కౌగలించుకుని, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నా అని అభి చెప్పగానే ఆశ్చర్యపోయాడట. తన పక్కనే కూర్చోబెట్టుకుని ముచ్చటించాడట. అనుష్కకు పరిచయం చేస్తూ ‘నా మొదటి సినిమాలో నటించాడు, మంచి ఫ్రెండ్’ అని చెప్పాడట. ఇది ప్రభాస్ సింప్లిసిటీకి నిదర్శనం.