మరో సైకో కిల్లర్ – ‘రాక్షసుడు’ ట్రైలర్ విడుదల!

మరో సైకో కిల్లర్ – ‘రాక్ష‌సుడు` ట్రైల‌ర్ విడుద‌ల‌!

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త మూవీ ‘రాక్షసుడు’ ట్రైలర్ విడుదలైంది. పోలీసు అధికారి పాత్రలో సైకో కిల్లర్ ని పట్టుకునే కథగా ట్రైలర్ సాగింది…”నేనంటే భయానికే భయం…నన్నుపట్టుకోవాలనుకోకు…పట్టుకోవాలనుకున్నా అది నేనవ్వను” అనే సైకో కిల్లర్ వాయిసోవర్ తో ఓపెనవుతుంది….కనబడకుండా అజ్ఞాతంగా ఉంటూ పోలీసులతో ఆడుకునే ఆటగా వుంది. స్కూలు కెళ్లే బాలికలని అపహరించి చంపే ఈ సైకోకిల్లర్ ని పట్టుకునే వ్యూహాలు పన్నే, యాక్షన్ లోకి దిగే అధికారిగా సీరియస్ నటనతో బెల్లంకొండ కన్పిస్తున్నాడు. లవ్ ఇంటరెస్ట్ గా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ వుంది. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ గల ఈ సైకో కిల్లర్ థ్రిల్లర్ మూవీ తమిళంలో హిట్టయిన ‘రాక్షసన్’ కి రీమేక్. తమిళంలో ఈ స్మాల్ మూవీ 20 కోట్లు వసూలు చేసింది.

తెలుగులో ఈ మధ్య వారం వారం రోటీన్ రోమాంటిక్ కామెడీలు రావడం తగ్గి క్రైం థ్రిల్లర్స్ పెరిగాయి. ఈ ట్రెండ్ లోకి బెల్లంకొండ కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంటరయ్యాడు. సీత, కవచం, సాక్ష్యం, జయజానకీ నాయక అనే గత నాల్గు సినిమాలతో ఫ్లాపయిన తను ఈసారి తమిళ రీమేక్ ని నమ్ముకుని హిట్టవుతాడో లేదో చూడాలి. తమిళంలో రాం కుమార్ దర్శకత్వంలో విష్ణు విశాల్, అమలా పాల్ నటించారు. జిబ్రాన్ మంచి సంగీతం అందించాడు. తెలుగుకి కూడా ఇతనే మ్యూజిక్ డైరెక్టర్.

`రైడ్‌`, `వీర` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ రూపొందుతోంది. ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్‌ంన్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌. రచన: సాగర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ సైకో థ్రిల్లర్ ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నారు.

Rakshasudu Official Trailer || Bellamkonda Sreenivas , Anupama Parameswaran || Ramesh Varma