మంచు విష్ణుది కాన్ఫిడెంటా.. ఓవ‌ర్ కాన్ఫిడెంటా ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `భ‌క్త‌క‌న్పప్ప‌`. ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించి చాలా నెల‌ల‌వుతోంది. అయినా ఇంత వ‌ర‌కు ముందుకు క‌ద‌ల‌లేదు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌కత్వంలో చేయాల‌నుకున్నాడు మంచు విష్ణు అయితే సినిమా, బడ్జెట్ భ‌ర‌ణి చేయి దాటిపోయింద‌ట‌. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తాను త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించి సైడైపోయాడు.

అయినా ఈ ప్రాజెక్ట్‌ని మంచు విష్ణు వ‌ద‌ల‌డం లేదు. దాదాపు 92 కోట్ల భారీ వ్య‌యంతో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని గ్రాఫిక‌ల్ వండ‌ర్‌గా రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. మ‌రి మీకు అంత మార్కెట్ లేదు క‌దా అని అడిగితే మాత్రం ప్ర‌స్తుతం చేస్తున్న `మోస‌గాళ్లు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంది. దాంతో త‌న మార్కెట్ స్థాయి పెరుగుతుంద‌ని ఇటీవ‌ల ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ మంచు విష్ణు చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇది అయ్యే ప‌నేనా? .. నిజంగా మంచు విష్ణుది కాన్ఫిడెంట్ కాదు ఓవ‌ర్ కాన్ఫిడెస్సే అంటున్నారు. నిజ‌మే మ‌రి.