భన్సాలీ చిత్రంలో అలియా భట్

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ట్రిపుల్ ఆర్‌తోపాటు, బ్రహ్మాస్త్ర, తఖ్త్ చిత్రాలతో నటిస్తున్న ఆలియా భట్ ప్రస్తుతం ఆనందంతో ఎగిరి గంతేస్తోంది. ఈ ఆనందం ఎందుకంటే ‘ఎప్పటికైనా భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేయాలన్నది నా కల’ అంటూ అనేక సందర్భాల్లో ఆలియాభట్ చెబుతూనే ఉంది.

తాజాగా టాప్ డైరెక్టర్ సంజల్‌లీలా భన్సాలీ ఇన్నాళ్లకు అవకాశమిచ్చాడట. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరుతోందన్న మాట. సల్మాన్ ఖాన్‌తో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించనున్న తాజా చిత్రం -ఇన్‌షా అల్లా. సల్మాన్ సరసన ఆలియాను అనుకుని, అదే విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి చెప్పారట. అంతే కాకుండా కథ బాగా నచ్చింది. పైగా భన్సాలీ డైరెక్షన్‌లో వస్తోంది. ఆ ఆనందాన్ని ఎలా చెప్పాలి
అంటోంది ఆలియా భట్.

ఇది ఇలా ఉండగా భన్సాలీ సినిమా కోసం తెలుగులో ఓ పెద్ద హీరో సరసన ఒక భారీ బడ్జెట్ సినిమాలో అవకాశాన్ని వద్దనుకుందట!