బ‌న్నీ- సుకుమార్ మూవీ టైటిల్ ఇదేనా?

#AA20

అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లో వున్న బ‌న్నీ త‌న నెక్ట్స్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ ఓ ఊర‌మాస్ మ‌సాలా యాక్ష‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లాక్ డౌన్ లేక‌పోయినా, ఈ స్థాయిలో క‌రోనా ప్ర‌భావం చూపించ‌క‌పోయినా ఇప్ప‌టికి కేర‌ళ అడ‌వుల్లో షూటింగ్ జ‌ర‌పుకుంటూ వుండేది.

క‌రోనా కార‌ణంగా సీన్ మారింది. దీంతో టీమ్ ఇంటికే ప‌రిమిత‌మైపోయింది. తాజాగా బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోని ఈ బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్టు అపీషియ‌ల్‌గా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. సినిమాలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. చిత్తూరు యాస‌లో బ‌న్నీ ఇందులో డైలాగ్‌లు చెబుతాడ‌ట‌. ఈ విష‌యాన్ని తెలివిగా చిత్ర బృందం టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో డైలాగ్‌ల‌తో క్లారిటీ ఇచ్చేశారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై ఓ న్యూస్ వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రానికి సుక్కు రెండ‌క్ష‌రాల పేరునే డిసైటడ్ చేశాడ‌ని, అది కూడా హీరోయిన్ పేర‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటా అని ఆరాతీస్తే `పుష్ప‌` అని తెలిసింది. ఇదే ఫైన‌ల్ అయితే మాత్రం ఇలాంటి టైటిల్ బ‌న్నీ సినిమాకు పెట్ట‌డం ఇదే తొలిసారి కాబోతోంది. బ‌న్నీ సినిమా టైటిల్‌పై సాగుతున్న ఉత్కంఠ‌కు మరి కొన్ని గంట‌ల్లోనే తెర‌ప‌డ‌బోతోంది. ఏది నిజం.. ఏది అబ‌ద్ధం తెలియాలంటే బుధ‌వారం 9 గంట‌ల వ‌ర‌కు వేచియూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌లో విల‌న్‌గా త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు.