ఇటీవల జరిగిన ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ వేదికపై అల్లు అర్జున్ త్వరలో రెండు పార్టీలు ఇవ్వబోతున్నానని, ఒకటి ఇండస్ట్రీ వర్గాలకు, మరొకటి మీడియాకు అని ఓపెన్‌గా ప్రకటించాడు. ఇండస్ట్రీ వర్గాలకు ఇచ్చే పార్టీ కోసం స్వయంగా త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. భారీ రేంజ్‌లో పార్టీ చేయాలని, అంతా తను పిలవగానే వచ్చేస్తున్నారని తెగ సంబరపడిపోయాడు. ఇంటి ఆవరణలో పార్టీ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌లు, యంగ్ డైరెక్టర్‌లు, రాఘవేంద్రరావు, కొరటాల శివ, కరుణాకరన్, శ్రీను వైట్ల, సురేందర్‌రెడ్డి, త్రివిక్రమ్, బొమ్మరిల్లు భాస్కర్, ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి దర్శకులు తనికెళ్ల భరణి లాంటి కొంత మంది ఆర్టిస్ట్‌లు తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా వారెవరూ ఈ పార్టీలో కనిపించలేదు.
బన్నీ ఇండస్ట్రీ పార్టీ అంటే ఇంతేనా? ..ఆదివారం బన్నీ ఇచ్చిన పార్టీ ఇండస్ట్రీ పార్టీనా లేక దర్శకుల పార్టీనా అని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ పార్టీలో మెగా హీరోలు ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది. ఇక చెప్పుకోదగ్గ బయటి హీరోలు కూడా ఈ పార్టీకి దూరంగానే వున్నట్టు టాక్. ఇదిలా వుంటే బన్నీ మాత్రం పార్టీకి అనుకున్న వాళ్లు రాక ముఖం చాటేసినా తెగ ఎంజాయ్ చేశాడని చెబుతున్నారు.