బ్రేక‌ప్ డార్లింగ్‌తో అన్నను క‌లుపుతున్న చెల్లెలు

బ్రేక‌ప్ డార్లింగ్‌తో అన్నను క‌లుపుతున్న చెల్లెలు

నాలుగేళ్ల పాటు క‌లిసే షికార్లు చేశారు. ఘాటైన ప్రేమాయ‌ణం సాగించారు. డేటింగులు ఔటింగులు అంటూ మీడియాని ప‌రుగులెత్తించారు. ఇక డేటింగులో బోలెడ‌న్ని క‌ల‌త‌లు కూడాను. అటుపై వ‌న్ ఫైన్ డే నీకు నాకు కుద‌ర‌దు .. క‌టీఫ్ !! అంటూ విడిపోయారు. అటుపై ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ అయిపోయారు. ఆ త‌ర్వాత కేవ‌లం స్నేహితులుగా కొన‌సాగుతున్నామ‌ని తెలిపారు. ఇదంతా ఎవ‌రి గురించి? అంటే ప్ర‌త్యేకించి చెప్పాలా? టైగ‌ర్ ష్రాఫ్‌- దిశా ప‌టానీ జంట గురించే.

ఈ జంట ల‌వ్ స్టోరీ గురించి తెలిసిందే. భాఘీ 2లో క‌థానాయిక‌గా న‌టించిన దిశా భాఘీ 3లోనూ ఐటెమ్ నంబ‌ర్ లో మెరిసింది. అయితే అప్ప‌టికే ఆ ఇద్ద‌రూ విడిపోయారు. ఇక‌పోతే దిశా ప‌టానీకి టైగ‌ర్ మ‌ద‌ర్ అయేషా ష్రాఫ్ తో స‌రిప‌డ‌డం లేద‌ని అందుకే ప్రేమికులిద్ద‌రూ విడిపోయార‌ని చాలా కాలం క్రితం ప్ర‌చార‌మైంది. టైగ‌ర్ ని దిశా క‌ల‌వ‌డం టైగ‌ర్ మామ్ అయేషాకి ఇష్టం లేదని ప్ర‌చార‌మైంది. అయితే అదంతా వ‌ట్టి అబ‌ద్ధం అని లాక్ డౌన్ వేళ ప్రూవైంది. నిను వీడ‌ని నీడ‌ను నేను! అన్న చందంగా దిశా ప్ర‌స్తుతం టైగ‌ర్ కుటుంబంతోనే క‌లిసి ఉంటోంద‌న్న పుకార్ ముంబైలో షికార్ చేస్తోంది. దిశా .. టైగ‌ర్ సోద‌రి కృష్ణా ష్రాఫ్ ఇద్ద‌రూ క్లోజ్ ఫ్రెండ్స్. వారి మ‌ధ్య స్నేహం ఎప్ప‌టికీ అలానే ఉంది. ఇక ఆ ఇద్ద‌రూ క‌లిసే కిరాణా కొట్టుకి వెళుతున్నారు. అయితే టైగ‌ర్ ని త‌న ప్రేయ‌సితో క‌లిపేందుకు కృష్ణా ట్రై చేస్తోందా? అంటే ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు అని సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. టైగ‌ర్ సోద‌రితోనే దిశా ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డంతో ఇక మ‌ళ్లీ మాజీ ప్రియుడితో క‌మిటైపోయిందా? అన్న గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయి.

ఇక దిశా.. టైగ‌ర్ బాండింగ్ గురించి కృష్ణా ఏమందంటే…? “దిశా.. మా ఇంటికి దగ్గరలోనే నివసిస్తుంది. మేం కొన్నిసార్లు కిరాణా షాపింగ్‌కు వెళ్లాం. టైగర్ ఒంటరివాడ‌య్యాడు. అతను దిశాతో స్నేహం చేస్తే మంచిదే. త‌ను చాలా మంచి అమ్మాయి. అన్నా దిశా యుగాలుగా స్నేహితులు. మేము ఫిట్‌నెస్ ‌తో కనెక్ట్ అయ్యాం. టైగర్ ఒంటరివాడు కాబట్టి.. దిశాతో ఎక్కువ సమయం గడుపుతుంటే ఆమె మంచి అమ్మాయి అని నేను గుర్తించాను“ అని అంది. ఇక లాక్డౌన్ వేళ సరదాగా గడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇవి చూసిన టైగ‌ర్ అభిమానులు ప్రస్తుతానికి ష్రాఫ్ తో దిశా ల‌వ్ కొన‌సాగుతోంద‌ని భావించారు. అయితే టైగర్ సోదరి ఆ వాదనలన్నింటినీ ఖండించింది. లాక్డౌన్ కాలం తన సోదరుడు టైగర్ ‌తో దిశా టైమ్ ఎలా గ‌డిపింది అంటే.. ఆ ఇద్ద‌రూ కలిసి బోర్డు ఆటలు ఆడుతున్నారు. విందులో బంధం కుదిరింది అని ఆమె పేర్కొన్నారు. మ‌రోవైపు కృష్ణ లాక్ డౌన్ కంటే ముందు త‌న ప్రియుడు ఎబాన్ హైమ్స్ తో రెండు నెలల సుదీర్ఘ నార్త్ ఈస్ట్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన సంగ‌తి తెలిసిందే.