ఆ జిల్లాలో టాప్ టీడీపీ నేత రాజీనామా? చంద్రబాబు కి ఇక నిద్ర కూడా పట్టదు?

krishna district top tdp leader resigned

2019 ఎన్నికలతో టీడీపీ ఖేల్ ఖతమయిపోయింది. ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కసారిగా ఓడలు బండ్లు.. బండ్లు ఓడలయ్యాయి. చంద్రబాబు అధికారానికి దూరం కాగానే.. పార్టీలోని సీనియర్ నేతలంతా వైసీపీలో చేరడానికి క్యూ కట్టారు. వైసీపీ కూడా బాగానే ఆఫర్లు ఇస్తోంది. వైసీపీలోకి వలసలు స్టార్ట్ కాలేదు కానీ.. ఒక్క నేత టీడీపీ నుంచి జంప్ అయితే.. ఇక అందరూ వరుసగా వైసీపీలోకి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయట.

krishna district top tdp leader resigned
krishna district top tdp leader resigned

కట్ చేస్తే.. కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు పార్టీ మారుతున్నారంటూ ప్రస్తుతం వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆయన టీడీపీలో ముఖ్యమైన నేత కావడంతో ఆయన పార్టీ మారితే.. టీడీపీ ఇక ఖాళీ కావడమేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

టీడీపీ హయాంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆ నేత.. ప్రస్తుతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారట. ఆయన వెనుకే మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారట. కాకపోతే.. ఆయన పార్టీ ఎప్పుడు మారుతున్నారు.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

గుంటూరు జిల్లాకు చెందిన మరో టీడీపీ నేత కూడా పార్టీ మారుతారట. వీళ్లంతా వైసీపీలోకి చేరితే.. ఎలా ఉంటుంది.. రాజకీయాలు ఎలా మారుతాయి.. అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.