బిగ్‌బాస్ కోసం కొత్త డిమాండ్‌

బిగ్‌బాస్ కోసం కొత్త డిమాండ్‌

సోష‌ల్ మీడియా వ‌చ్చేశాక స్టార్ లేదు, సెల‌బ్రిటీ లేదు.. ఎవ‌రికి న‌చ్చింది వాళ్లు నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. ఫీల‌వుతారేమో అని కూడా చూడ‌టం లేదు. ఇటీవ‌ల లాక్ డౌన్ సంద‌ర్భంగా రామానంద సాగ‌ర్ `రామాయ‌ణ్‌`ని టెలీకాస్ట్ చేయాల్సిందే అని కోరిన నెటిజ‌న్స్ తాజాగా అలాంటి డిమాండ్‌నే సోష‌ల్‌ మీడియా వేదిక‌గా కోరుతున్నారు.

లాక్ డౌన్ కార‌ణంగా టెలీ సీరియ‌ల్స్‌, ప్రోగ్రామ్స్ షూటింగ్ నిర‌వ‌దికంగా వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. దీంతో టీవీ ఛాన‌ల్ అన్నీ పాత కార్య‌క్ర‌మాల‌నే మ‌ళ్లీ రిపీట్ చేయ‌డం మొద‌లుపెట్టాయి. ప‌నిలో ప‌నిగా నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ బిగ్‌బాస్ సీజ‌న్ 3ని స్టార్ మా రీ టెలీకాస్ట్ చేస్తోంది.

అయితే ఈ సీజ‌న్ 3 మాకొద్దు బాబోయ్ అంటున్నారు నెటిజ‌న్స్‌. ఆ స్థానంలో ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హరించిన సీజ‌న్ వ‌న్‌ని రీ టెలీకాస్ట్ చేయ‌మ‌ని కోరుతున్నారు. మ‌రి ఈ ప‌బ్లిక్ డిమాండ్‌ని స్టార్ మా మేనేజ్‌మెంట్ ఒప్పుకుంటుందా అన్న‌ది వేచ చూడాల్సిందే.