బాల‌య్య దిష్టి బొమ్మ‌లా వున్నాడా?

నిత్యం వివాదాల చుట్టూ తిరిగే రామ్ గోపాల్ వ‌ర్మ మ‌ళ్లీ లైన్‌లోకి వ‌చ్చాడు. `బ్యూటిఫుల్` సినిమా ప్ర‌చారంలో హీరోయిన్ నైనా గంగూలీ కాళ్ల‌పై ప‌డి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసిన వ‌ర్మ చూపు తాజాగా బాల‌య్య‌తో రోజా తీసుకున్న సెల్ఫీపై ప‌డింది. ఇంకే ముంది ఇలాంటి ఆధారం దొరికితే వ‌ర్మ రెచ్చిపోడూ అచ్చం అదే జ‌రిగింది. బుధ‌వారం ఏపీ మూడు రాజ‌ధానులకు సంబంధించిన బిల్లుపై శాస‌న మండ‌లిలో వాడీ వేడీ చ‌ర్చ జ‌రుగుతోంటే బాల‌య్య‌తో చిరున‌వ్వులు చిందిస్తూ రోజా సెల్ఫీకి పోజులివ్వ‌డం వివాదంగా మారింది.

ఈ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన వ‌ర్మ ప‌లు ఆస‌క్తిర వ్య‌ఖ్యలు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. `వావ్ రోజా గారు హీరోలా క‌నిపిస్తున్నారు. ఆమె కుడి ప‌క్క‌న కూర్చున్న వ్య‌క్తి ఎవ‌రో తెలియ‌దు కానీ అత‌న్ని చూస్తే వాంతొస్తోంది. అత‌ని ఫేస్ ఫ్రేమ్‌లో వుండ‌టం వ‌ల్ల రోజా అందం స్పాయిల్ అయిపోతోంది. బ‌హుషా అత‌ను రోజా అందానికి అడ్డంగా వున్న దిష్టి బొమ్మేమో` అని వ‌ర్మ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బాల‌య్య ఫ్యాన్స్ మాత్రం వ‌ర్మ ట్వీట్‌పై మండిప‌డుతున్నారు. బాల‌య్య‌ను దిష్టిబొమ్మ అంటావా?, ఆయ‌న‌ను చూస్తే వాంతొస్తోందా? అని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి వ‌ర్మ ఎలాంటి స‌మాధానం చెబుతాడో.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టుగా కౌంట‌ర్ ఇస్తాడో చూడాలి.