ఫొటోస్టోరీ: ప్ర‌గ్యా ఏందీ బికీనీ ర‌చ్చ‌?

సోష‌ల్ మీడియాని హీరోయిన్స్ బాగానే వాడేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు లేక‌.. అవ‌కాశాల కోసం గాలం వేయాల‌నుకునే హీరోయిన్‌ల‌కు సోష‌ల్ మీడియా బెస్ట్ ప్లాట్ ఫామ్‌గా మారింది.. మారింది అన‌డం కంటే మార్చుకుంటున్నారు అన‌డం క‌రెక్టేమో. ఎవ‌రి ఇన్‌స్టా పేజ్ తీసినా హాట్ హాట్ ఫొటోల జాత‌రే క‌నిపిస్తోంది. `కంచె` త‌రువాత ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోతున్న ప్ర‌గ్యా జైస్వాల్ కూడా ఇన్‌స్టానే న‌మ్ముకుంటోంది.

ఎక్క‌డ హాట్ షో చేసినా ఇన్‌స్టాని ఫొటోల‌తో నింపేస్తూ హీటెక్కించేస్తోంది. ఇటీవ‌ల వ‌రుస హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేసిన ప్ర‌గ్యా తాజాగా బ్లాక్ బికినీలో స‌న్ బాత్ చేస్తూ ఫొటోల‌కి పోజులిచ్చింది. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం ఇన్‌స్టాలో నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. బ్యాక్ పోజ్‌లో ప్ర‌గ్యా అందాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికైనా ప్ర‌గ్యా టాలెంట్‌ని ఏ డైరెక్ట‌రైనా గుర్తించి బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తాడేమో చూడాల‌ని నెటిజ‌న్స్ కామెంట్‌లు చేస్తున్నారు. క్రిష్ – ప‌వ‌న్‌ల చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా అవ‌కాశం ఇవ్వ‌బోతున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిష్ క్లారిటీ ఇస్తే కానీ అది రియ‌లా? రూమ‌రా అన్న‌ది స్ప‌ష్టం కాదు.