ఫొటోస్టోరీ: గుండెజారి గ‌ల్లంత‌య్యిందే!

చీరె క‌ట్టులో బొద్దుగా ముద్దుగా క‌నిపించే విద్యాబాల‌న్ ఒక్క‌సారిగా హాట్‌గా మారి అందాల విందు చేస్తే కుర్ర‌కారు గుండెజారి గ‌ల్లంయ్యిందే అంటారంతే. బాలీవుడ్ ఫేమ‌స్ ఫొటోగ్రాఫ‌ర్ డ‌బ్బూ ర‌త్నాని గ‌త కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్‌ల‌తో న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్ షూట్‌ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఈ ఫొటో షూట్ కోసం బాలీవుడ్ స్టార్స్ ప్ర‌తీ ఏడాది పోటీప‌డుతూనే వున్నారు. తాజాగా 2020 కోసం డ‌బ్బూ ర‌త్నాని చేసిన ఫొటో షూట్ క్యాలెండ‌ర్ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తోంది.

విద్యాబాల‌న్ ష‌వ‌ర్ బాత్ డ్రెస్‌లో అందాలొలికిస్తున్న ఓ ఫోటో నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కించేస్తోంది. పెళ్లైనా విద్యాబాల‌న్ మ‌రీ ఇంత హాట్‌గా వుందే అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. విద్యాబాల‌న్ హాట్ ఎక్స్‌పోజింగ్‌కి సంబంధించిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విద్యాబాల‌న్‌తో పాటు డ‌బ్బూ ర‌త్నానీ ఫొటో షూట్‌లో బాలీవుడ్ స్టార్స్ కియానా అద్వానీ, భూమి ఫడ్నేక‌ర్‌, కృతి స‌న‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స‌న్నిలియోన్ పాల్గొన్నారు.