రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి దాదాపు పదిహేనేళ్ళు కావొస్తుంది. ఈశ్వర్ చిత్రం నుంచి బాహుబలి వరకు ఎదిగారాయన. ఇక ఇదిలా ఉంటే కృష్ణంరాజు తమ్ముడి కొడుకు ప్రభాస్‌రాజు. రాజులంటేనే బేసిక్‌గా వాళ్ళ వైభవం గురించి చెప్పక్కర్లేదు. సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా ప్రభాస్ మంచి ఫైనాన్షియల్ పొజీషన్ నుంచే సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ సంపన్న హీరోల్లో ఉన్న టాప్ హీరో ప్రభాస్. ఈ నటుడి వార్షిక ఆదాయం రూ.45 కోట్లని సమాచారం. బాహుబలి చిత్రం ఎంత పెద్ద స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలకి ముందు వరకు సినిమాకి పదిహేను నుండి ఇరవై కోట్లు తీసుకున్న ప్రభాస్ ‘బాహుబలిస తర్వాత అమాంతం ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఒక్కో చిత్రానికి పాతిక నుంచి ముప్పై కోట్ల వరకు అందుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి ఇన్నికోట్లకు అధిపతి అయిన ఈ హీరో లైఫ్‌స్టైల్ ఇంకెంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రేంజ్ మన టాలీవుడ్ హీరోలెవరికీ లేదనే చెప్పాలి. ప్రభాస్ దగ్గర ఉన్నబిఎండబ్లూ కారు ధర ఎక్స్ 3 – రూ.68 లక్షలు. ఆయన జిమ్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా జిమ్ ఎక్విప్మెంట్ – రూ.1.5 కోట్లు. ఇక మరో కారు ధర జాగ్వార్ ఎక్స్ జె ఆర్ – రూ.2.08 కోట్లు. ఇక లేటెస్ట్ రోల్స్ రాయిస్ – రూ.8 కోట్లు. హైదరాబాద్ లో ఆయనకున్న ఫాం హౌస్ ఏకంగా రూ.60 కోట్లు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రభాస్ ఉంటోన్న ఇల్లు దీని ధర యాభై కోట్లకు పైగానే ఉంటుంది. గతేడాది ‘సాహో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్. ఆ చిత్రం కథ కథనాలు పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయినా.
బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. బాహుబలి చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా హై బడ్జెట్‌తో తెరకెక్కించాడు ప్రభాస్. అంతేరేంజ్లో దానికి కలెక్షన్లను అందుకున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రతస్తుం ఈ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం దాదాపు రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ జరుపుకుంటోంది. మరి ఈ చిత్రం ఓ హిస్టారికల్ లవ్ స్టోరీ అని వార్తలు వినిపిస్తు్న్నాయి. అలాగే ఇందులో గత చిత్రం కంటే ప్రభాస్ చాలా గ్లామర్‌గా కనిపిస్తాడన్న వార్తలు కూడా వినపిస్తున్నాయి.