`బాహుబలి` తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి స్టార్ అయిపోయాడు. ఈ మూవీ తరువాత చేసిన `సాహో` కూడా భారీ స్పాన్ వున్న సినిమా కావడంతో ప్రభాస్ స్థాయి మరింతగా పెరిగింది. దీంతో అతనికి ఆ స్థాయి ఆఫర్లే రావడం మొదలైంది. తాజాగా సొంత నిర్మాణ సంస్థ యువీలో చేస్తున్న `జాన్` చిత్రం కూడా అదే స్థాయిలో తెరకెక్కుతుఓంది. `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కరోనా వైరస్ ఉదృతం అవుతున్న సమయంలో జార్జియా వెళ్లి ప్రమాదం అని తెలిసినా కీలక ఘట్టాల్ని పూర్తి చేసి ఇండియా వచ్చింది యువీ టీమ్. ఇదిలా వుంటే `బాహుబలి` రిలీజ్ తరువాత నుంచి ప్రభాస
బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వినిస్తూనే వున్నాయి. కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చారని, అయితే క్యారెక్టర్ , ఆఫర్ నచ్చక ప్రభాస్ వదులుకున్నారని రక రకాల వార్తలు షికారు చేశాయి. ఆ తరువాత బాలీవుడ్ మోస్ట్ క్రేజీ ఫిల్మ్ `ధూమ్`. ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ `ధూమ్ 4`లో ప్రభాస్ విలన్‌గా నటిస్తాడని ప్రచారం జరిగింది.
తాజాగా అదే న్యూస్ మళ్లీ వినిపిస్తోంది. `ధూమ్`లో హీరోల కంటే విలన్ పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువ అన్నది అందరికి తెలిసిందే. తొలి భాగంలో జాన్ అబ్రహం, ఆ తరువాత సిక్వెల్‌లో హృతిక్ రోషన్, `ధూమ్ -3`లో ఆమీర్‌ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఫ్రాంచైజీలో రానున్న నాలుగవ భాగంలో షారుఖ్‌ఖాన్ నటిస్టారంటే లేదు లేదు సల్మాన్‌ఖాన్ నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సిరీస్‌లో `బాహుబలి` క్రేజ్‌ని వాడుకుని ప్రభాస్‌ని నటింపజేయాలని ఆదిత్య చోప్రా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాని చేయడానికి ప్రభాస్ ఆసక్తి చూపించడం లేదట. ఆదిత్య చోప్రా మాత్రం ప్రభాస్‌ని వదలడం లేదట. ప్రభాస్‌తో కుదరని పక్షంలో టైగర్ ష్రాఫ్‌ని లైన్‌లోకి దింపాలనుకుంటున్నాడట.