యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఇప్పటి వరకు చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల అనుష్కనే ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడంటూ పుకార్లు షికారు చేశాయి. వాటికి ఆజ్యం పోస్తూ నా 3 పీఎమ్ ఫ్రెండ్ ప్రభాస్ అని చెప్పడంతో ఈ పుకార్లు తారా స్థాయికి చేరాయి. అయితే అంతకు ముందే మెగా డాటర్ నిహారికతో ప్రభాస్ వివాహం జరగబోతోందని ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ వార్తలపై నిహారికని ప్రశ్నిస్తే ప్రభాస్‌పై నిహారిక షాకింగ్ కామెంట్స్ చేసింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంలో సెలబ్రిటీలంతా ఇంటి పట్టునే వుంటున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ కావడం కోసం సోషల్ మీడియాని వాడుకుంటూ లైవ్‌లో ఫ్యాన్స్‌కి అందుబాటులోకి వస్తున్నారు. తాజాగా కొణిదెల నిహారిక కూడా ఇన్ స్టా వేదికగా లైవ్‌లోకి వచ్చింది.
తను రానున్న రోజుల్లో చేయబోయే చిత్రాల్లో మరింత రొమాంటిక్‌గా కనిపిస్తానని, త్వరలో ఓ తమిళ సినిమా చేయబోతున్నానని, గోవా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్‌లు చాలానే వుంటాయని ఓపెన్‌గా చెప్పేసింది. ఇందులో భాగంగా ఓ అభిమాని ప్రభాస్‌తో పెళ్లన్నారు ఈ వార్తలపై మీరేమంటారన్నాడు. దీనికి నిహారిక సమాధానం చెప్పింది. ఈ విషయంలో ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరుస్తున్నందుకు సారీ. ప్రభాస్‌ని తాను ప్రేమించలేదని, పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని వెల్లడించింది.