బాహుబలి ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ పడిన రెండేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం చూపిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా పై రకరకాల విమర్శలు గుప్పించిన ప్రేక్షకుల చిత్రాన్ని ఆదరించారు. ఇక ప్రభాస్ తన తదుపరి చిత్రానికి డేట్లు కూడా ఇచ్చేసాడు త్వరలో షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా ప్రభాస్ కొంత సమయం కావాలని అడిగాడట.
ఎందుకు అంటే, విశ్రాంతి కోసం కాదట. ‘సాహో’ లో కొన్ని చోట్ల కొంచెం బొద్దుగా మరి కొన్ని చోట్ల ముఖం, శరీరం అలసి పోయినట్టుగా ఉన్నాడని చాలా మంది విమర్శించారు. అది ప్రభాస్ చెవిన పడింది. దాంతో తన తదుపరి సినిమాకి ఆ లోటు కనపడకూడదని సినిమా మొత్తం ఒకేలా కనిపించడానికి తనకు ఒక నెల సమయం కావాలని నిర్మాతలను అడిగాడట.
అవును అతను చెప్పింది సమంజసమే అని ఒప్పుకున్నారట నిర్మాతలు. కమిట్మెంట్ అంటే ఇదీ అని మెచ్చుకుంటున్నారట కూడా.