ప్రభాస్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిసిపోయింది

సాహో ఫిటెనెస్ సీక్రెట్…భలే ఇంట్రస్టింగ్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలలోనూ ఈ సినిమాకు సంబంధించి భారీగా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటులు పెద్ద సంఖ్యలో నటించిన ఈ సినిమాకు అక్కడ మీడియా కూడా ఓ రేంజిలో కవరేజ్‌ ఇస్తోంది.

ఈ నేపధ్యంలో బాహుబలిలో ఎంత ఫిట్ గా ఉన్నాడో అంతకు మించి ఫిట్ గా ఉన్న ప్రభాస్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇదెలా సాధ్యం అంటున్నారు. అయితే అందుకు కారణం ప్రభాస్ కష్టం అయితే అంతకు మించి ప్రభాస్ ఫిట్‌నెస్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డి ది అని తెలుస్తోంది.

ఈ సినిమాకు… ప్రభాస్… అత్యంత కఠినమైన ఫిట్‌నెస్ డైట్ రూల్స్ పాటించాడని తెలుస్తోంది. సాహో సినిమాలో బరువు తగ్గాలని డైరెక్టర్ సూచించాడు. దాంతో ప్రభాస్ ఫిట్‌నెస్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఛాలెంజ్ ఎదురైంది. దాంతో ప్రభాస్ ఫిట్‌గానే ఉండాలి, కండలూ ఉండాలి, కానీ బరువు మాత్రం పూర్తిగా తగ్గాలి. ఎలా చేయాలా ఆలోచించిన ఆయన… ప్రత్యేక డైట్ ద్వారా సక్సెస్ సాధించానని అంటున్నారు. ప్రభాస్ 10 కేజీల బరువు తగ్గాడు… కానీ… బాడీ షేప్ మాత్రం చెక్కు చెదరలేదు.

లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ…ఫుడ్ విషయానికి వస్తే… ప్రభాస్ ప్రధానంగా సరిపడా రైస్ తినేవాడు. బ్రెడ్, గుడ్డులో తెల్లసొన, చికెన్, నట్స్ (బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి) ఎక్కువగా తీసుకునేవాడు. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం వల్లే ప్రభాస్ ఫిట్‌గా ఉండగలగుతున్నాడు. ఫిట్‌నెస్ కోసం ప్రభాస్… ప్రతి రోజూ… గంటపాటూ… కార్డియో సెషన్స్‌లో పాల్గొనేవాడు. ఇందులో భాగంగా స్విమ్మింగ్, సైక్లింగ్ చేసేవాడు. వాలీబాల్ ఆడేవాడని తెలిపాడు.