స్టైలిష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో తన మార్కుని చూపించినట్టే సొంత ఇంటి నిర్మాణం విషయంలోనూ తన మార్కుని, ప్రత్యేకతను చాటుకున్నారు. జూబ్లీహిల్స్‌లో పూరి జగన్నాథ్ సకల సౌకర్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని మరీ 20 కోట్ల ఖర్చుతో ఓ ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. దీనికి ఆయన పెట్టుకున్న పేరు `కేవ్`. దీన గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇంటితో పాటు కిందే తన ఆఫీస్‌ని ప్రత్యేకంగా పూరి డిజైన్ చేయించుకున్నారు కూడా.
అఫ్ కోర్స్ చార్మీ ఎంటర్ కావడం, ప్రత్యేకంగా నార్తకు సంబంధించిన వారిని కేవ్‌కు కాపలా పెట్టడం, వారికి ప్రత్యేకంగా లైసెన్డ్స్ గన్స్ ఇవ్వడం అందరికి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండతో `ఫైటర్` చిత్రాన్ని ముంబైలో మొదలుపెట్టిన ఈ జోడీ అక్కడ కళ్లు చెదిరిపోయే ఆఫీస్‌ని తెరిచారట. `కేవ్`తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన పూరి అందుకు పదింతల సౌకర్యాలతో కొత్త ఆఫస్ వుందని, `కేవ్` దీని కింద తేలిపోతుందని రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు.
ముంబైలోని జగన్, చార్మిల ఆఫీస్ అడ్డాకు వెళ్లాను. కేవ్‌కు పది రెట్లు వుందని, ఆఫీస్ చూసి ఆశ్యర్యపోయానని, ఈ కొత్త ఆఫీస్ ఇద్దరికి మరింత పవర్‌ని అందించాలని వర్మ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పూరి, చార్మి `ఫైటర్` చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.