పుష్ప కోసం బాలీవుడ్ పై ప‌డుతున్నారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న `పుష్ప` చిత్రంలో బ‌న్నీ డీ గ్లామ‌ర్ రోల్ ని రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. గంద‌పు దుంగ‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో అన‌గానే ఇదో స‌స్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లా ఉంటుంద‌ని అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. తాజాగా బ‌న్నీ ఊర మాస్ లుక్ తో ఆ అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. దుంగ‌లు దొంగిలించి పోలీసుల‌కు దొరికిపోతే వాళ్ల స్టైల్లో కూర్చొబెట్టి ఫోటో లు కొడుతుంటే? ఎలా ఉంటుందో తెలిసిందే. స‌రిగ్గా అదే లుక్ ని సెట్స్ కు వెళ్ల‌క‌ముందే సుకుమార్ బ‌జ్ క్రియేట్ చేయ‌డానికి వ‌దిలి నూటికి న‌రుపాళ్లు స‌క్సెస్ అయ్యాడు.

తాజాగా ఈ సినిమా లో కీల‌కమైన పాత్ర‌ల కోసం సుకుమార్ బాలీవుడ్ న‌టుల‌పై ప‌డిన‌ట్లు స‌మాచారం. బ‌న్నీ ని ఢీ కొట్ట‌డానికి సంజ‌య్ ద‌త్ ని గానీ…సునీల్ శెట్టిని గానీ తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట‌. ముందుగా సంజ‌య్ నే సుకుమార్ తొలి ఆప్ష‌న్ అని…అది గ‌నుక మిస్ అయితే సునీల్ శెట్టి ని సెకెండ్ ఛాయిస్ గా పెట్టిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే సంజ‌య్ ద‌త్ తెలుగు సినిమాలో విల‌న్ గా క‌న్విన్స్ చేయ‌డం అన్న‌ది అంత ఈజీగా కాదు. బాలీవుడ్ లో ఆయ‌న పెద్ద స్టార్ క‌మ్ విల‌న్. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో కేజీఎఫ్ -2లో విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు.

ఇది పాన్ ఇండియా సినిమా కావ‌డం..కేజీఎఫ్ చాప్ట‌ర్ 1కి వ‌చ్చిన రెస్పాన్స కార‌ణంగా ఇందులో న‌టించ‌డానికి ద‌త్ అంగీక‌రించాడు. కానీ బ‌న్నీ సినిమాలో న‌టించ‌డం అంత ఈజీ కాదు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కూడా కాదు కాబ‌ట్టి..ద‌త్ అంగీక‌రిస్తాడా? అన్న చాలా సందేహాలున్నాయి. ఇక సునీల్ శెట్టి అయితే ఈజీగా లాక్ అవుతాడు. బాలీవుడ్ లో కొన్నేళ్ల‌గా ఖాళీగా ఉంటోన్న న‌టుడు. ఇటీవ‌లే త‌మిళ్ లో ర‌జ‌నీకాంత్ న‌టించిన ద‌ర్బార్ లో విల‌న్ పాత్ర‌లో న‌టించాడు. కాబ‌ట్టి బ‌న్నీ సినిమాలో ఈ కీరోల్ కు అంగీక‌రించే ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయి.