రూటు మార్చకోకపోతే కెరీర్ గల్లంతే
మొదటి చిత్రంతోనే బోల్డ్‌గా అందాలు ఆరబోయడం, ముద్దులు మీద ముద్దులు పెట్టేసి, కుర్రకారును తన ఒంపుసొంపులతో ఆకట్టుకోవటం చేసేసింది పాయల్ రాజ్ పుట్. ‘ఆర్.ఎక్స్ -100’ చిత్రంలో అందాలన్నీ ఆరబోసి సంచలన స్టార్ గా మారింది. దీంతో పాయల్‌కు అవకాశాలు క్యూ కట్టేసాయి. అయితే అవన్నీ ప్రక్కన పెట్టి ఆర్ డి ఎక్స్ లవ్ అనే సినిమా చేసింది.
ఆర్.ఎక్స్ 100 క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలన్న తాపత్రయం టైటిల్ తోనే చూపించేసుకున్న దర్శక నిర్మాతలు….సినిమాను అదే తరహా కంటెంట్ తో నింపేసారు. ఈ సినిమా నిమిత్తం రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ హాటుగా, ఘాటుగా ఉండటంతో ఎంతో కొంత విషయం ఉంటుందని ఎక్సపెక్ట్ చేసారు. శృంగారం కోసం తాపత్రయపడే అబ్బాయి, అమ్మాయిల కథలా కనిపిస్తోందనుకున్నారు. అయితే ఈ రోజు విడుదలైన ఈ సినిమా అంత సీన్ లేదని తేల్చేసింది.
బీ గ్రేడ్ మూవీ కంటెంట్ తో మరీ పాత కాలం కథ,కథనంలో వచ్చింది. దాంతో ఈ రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా విషయం ఇదీ అని తేలిపోయింది. అప్పటికి ఓపినింగ్స్ ఓకే అనిపించుకున్నా కలెక్షన్స్ మాత్రం నిలబడవని తేల్చేసారు. ఓపక్క రవితేజ లాంటి హీరోల సినిమాల్లో నటిస్తూ, పాయల్ ఇలాంటి కథల్ని ఎందుకు ఎంచుకుంటోందో? ఈ సినిమా అటూ ఇటూ అయితే పాయల్ కెరీర్ ప్రమాదంలో పడిపోతుందని హెచ్చరిస్తున్నారు.