పాయల్ మరో కాజల్ కానుందా?

‘RX100 ‘ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, బోల్డ్ సన్నివేశాలతో పాటు నెగటివ్ ఛాయలున్న పాత్ర కూడా చేసి తన నటన నిరూపించుకుంది పాయల్. అయితే ఆ తరువాత వచ్చిన ‘RDX లవ్’ తో ఆమె ఆ క్రేజ్ ను నిలబెట్టుకోలేకపోయింది. అయినా సరే ఆమెకు మంచి అవకాశాలే ఉన్నాయి చేతిలో. రవితేజ సరసన ‘డిస్కో రాజా’, వెంకటేష్ సరసన ‘వెంకీ మామ’ చిత్రాల్లో నటిస్తోంది.

ఇది పక్కన పెడితే ఒకప్పుడు చాలా పెద్ద హిట్లు ఇచ్చి ఎంతో మంది కొత్త వాళ్ళను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు తేజ కన్ను పాయల్ పై పడింది. ఆయన తాజాగా ‘సీత’ పరాజయం తరువాత ఒక కధానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో పాయల్ నటించనుందని సమాచారం.

తేజ పరిచయం చేసిన కాజల్ అగర్వాల్ పెద్ద స్టార్ అయింది. మరి ఈ సినిమాతో పాయల్ కూడా కాజల్ మాదిరే పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.