హీరోయిన్‌లు, హీరోలు పెళ్లెప్పడంటే పారిపోతుంటే ఓ హీరోయిన్ మాత్రం పెళ్లై ఏడాది తిరక్కుండా తల్లి కాబోతూ షాకిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గడం, వస్తుందనుకున్న అవకాశం ఊరించి ముఖం చాటేయడంతో విసుగెత్తిపోయిన హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ గత ఏడాది వివాహం చేసుకుంది. `అలియాస్ జానకి` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది.
పవన్‌కల్యాణ్ నటించిన `సర్దార్ గబ్బర్‌సింగ్` చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం సొంతం చేసుకుంటోందంటూ వార్తలు షికారు చేశాయి కూడా. ఈ టైమ్‌లోనే అనీషా ఆంబ్రోస్ పేరు పాపులర్ అయింది. కానీ అవకాశాన్ని మాత్రం కాజల్ అగర్వాల్ ఎగరేసుకుపోయింది. ఆ తరువాత చేసిన సినిమాలు కూడా ఆశించి ఫలితాన్ని అందించక హీరోయిన్ తన కెరీర్‌ని ప్రశ్నార్థకంలో పడేయడంతో పెళ్లికి సిద్ధమై టాలీవుడ్‌కి షాకిచ్చింది.
2019 ఫిబ్రవరిలో చెప్పినట్టే గుణ అనే యువకుడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అనీషా గర్భవతి. ఏడాది తిరక్కుండానే ప్రెగ్నెంట్ కావడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా షాకవుతున్నారు. అనీషా త్వరలోనే ఓ పండంటి పాపకు జన్మనివ్వబోతోంది.