‘పలాస 1978’ సినిమా మొదటి లిరికల్ ఎస్పీబి చేతుల మీదుగా విడుదల

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న చిత్రం ‘1978 పలాస’ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు రఘు కుంచే ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. గానగంధర్వుడు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తాజా సంచలనం పల్లెకోయిల బేబీ కలిసి ఈ పాటను పాడటం విశేషం.
గాయనిగా కెరీర్ ఆరంభించిన ఆదిలోనే పల్లెకోయిల బేబీ ఏకంగా ఆయనతో కలిసి డ్యూయొట్ ఆలపించేయడం నిజంగా విశేషమే. లక్ష్మీ భూపాల ఈ పాటను రాశారు.

దర్శకుడు కరుణ కుమార్ కు ఇది తొలి చిత్రం. సుధ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. రఘు కుంచే తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.