రాం చరణ్ లా సుధీర్ బాబు ని చూస్తే బొమ్మ బ్లాక్ బస్టరే ..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన రంగస్థలం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత హీరోయిన్స్ గా నటించింది. కల్ట్ కంటెంట్ తో మాస్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా ఆకట్టుకుంది. చిట్టి బాబు గా
రాం చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతమని ప్రతీ ఒక్కరు ప్రశంసించారు. అంతేకాదు ఆ సినిమా తర్వాత చాలామంది హీరోలు అలాంటి క్యారెక్టర్ లో నటించాలని ట్రై చేస్తున్నారు.

Rangasthalam (Telugu) – Avinash's Blog

కాగా ఇప్పుడు యంగ్ హీరో సుదీర్ బాబు నటించబోతున్న తాజా చిత్రం తో ఇలాంటి ఇమేజ్ నే దక్కించుకోబోతున్నాడన్న టాక్ మొదలైంది. సుధీర్ బాబు రీసెంట్ గా ‘పలాస 1978’ సినిమాతో ఇండస్ట్రీలోని ప్రముఖుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాని చేసేందుకు కమిటయ్యాడు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ అన్న వెరైటీ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే.

Sudheer Babu's 'Sridevi Soda Center' announced! -

ఈ పోస్టర్ తో సుధీర్ బాబు లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుంది. కెరీర్ ప్రారంభం నుంచి సుధీర్ బాబు కొత్త తరహా కాన్సెప్ట్స్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాని ఒప్పుకోవడం విశేషం. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు గోదావరి యాసలో మాట్లాబోతున్నాడు. అందుకే పర్ఫార్మెన్స్ పరంగా రంగస్థలం లో రాం చరణ్ లా సుధీర్ బాబు చేస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు.