కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. జనం ఊహించని విపత్కర పరిస్థితి ఇది. చైనాలోని పుహాన్ చేసిన తప్పిదం ఒక్కసారిగా భయోత్పాతమైన వాతావరణంలోకి నెట్టేసింది. ప్రస్తుత పరిస్థితి నుంచి ప్రపంచం తప్పించుకోవాలంటే ఒక్కటేమార్గం వైరస్ వ్యాప్తిని అరికట్టడమే. దీని కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. లాక్ డౌన్ ప్రకటించింది.
దీన్ని రాష్ట్రాలు కూడా పాటించాలని సూచించింది. ఎందుకంటే బయటికి కనిపించని సూక్ష్మ క్రిమితో పోరాటం కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని, తేలిగ్గా తీసుకుంటే ఇటలీ పరిస్థితి తలెత్తే ప్రమాదం వుందని హెచ్చరికలు జారిచేస్తున్నారు. ఈ నెల 31 వరకు ప్రతీ రోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూని విధించారు. కరోనాపై ఉభయ తెలుగు రాష్ట్రాలు నిబద్ధతతో పనిచేస్తుండటం అభినందనీయమని భావించిన హీరో నితిన్ తన వంతు సహాయంగా కరోనా కట్టడి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి 20 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు.
ప్రపంచ విళయాన్ని తలపిస్తున్న ఈ సందర్భంలో అంతా ముందుకు రావాలని ఇండైరెక్ట్ గా నితిన్ ఇచ్చిన నినాదాన్ని ఎంత మంది హీరోలు పాటించి ముందుకొస్తారో చూడాలి.