నితిన్‌కు చెక్ పెట్టిన చంద్ర‌శేఖర్ ఏలేటి!

కొత్త త‌ర‌హా చిత్రాల‌ని అందించ‌డంలో ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ముందుంటారు. ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చి దాదాపు నాలుగేళ్ల‌వుతోంది. కొత్త క‌థ వుంటే త‌ప్ప సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూప‌ని చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కొంత విరామం త‌రువాత నితిన్‌తో ఓ సినిమాని మొద‌లుపెట్టాడు. జ‌రుగుతూ ఆగుతూ.. మొత్తానికి ప‌ట్టాలెక్కింది. ఆస‌క్తిక‌ర‌మైన థ్రిల్ల‌ర్‌ల‌ని అందించిన ఆయ‌న ఈసారి కూడా థ్రిల్ల‌ర్ క‌థ‌నే ఎంచుకున్నాడు.

నితిన్ హీరోగా న‌టిస్తున్న 28వ చిత్ర‌మిది. ఈ చిత్రానికి ముందు `చ‌ద‌రంగం` అనే టైటిల్‌ని అనుకున్నారు. సోష‌ల్ మీడియాలో లీకులు కూడా వ‌దిలారు. అయితే ఆ టైటిల్‌పై ఎలాంటి బ‌జ్ రాక‌పోవ‌డంతో దాన్ని ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలిసింది. తాజాగా ఈ చిత్రానికి `చెక్‌` అనే టైటిల్‌ని ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఫైన‌ల్ చేసిన‌ట్టు చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. డార్జిలింగ్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇద‌ని, థ్రిల్ల‌ర్ చిత్రాల్లో కొత్త పంథాకు శ్రీ‌కారం చుట్టే విధంగా సినిమా వుంటుంద‌ని చెబుతున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.