దాన్నుంచి బయటపడ్డాను – శృతి హాసన్

ఒకప్పుడు శృతి హాసన్ తెలుగులో తిరుగులేని హీరోయిన్. ఇప్పటిదాకా అంటే 2017 దాకా. అప్పుడు ఆమె చేసిన ‘కాటమరాయుడే’ ఇప్పటి దాకా చివరి చిత్రం. ఆ తరువాత మంచి ఆదరణ ఉన్న సమయంలో బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో పడి కెరీర్ ను పట్టించుకోలేదు.

ఆ తరువాత బ్రేకప్ అయ్యాక కళ్ళు తెరచి కెరీర్ ను బాగు చేసుకునే క్రమంలో ఉంది. ఇలాంటి ఈమె తాజాగా లక్ష్మి ప్రసన్న షో లో నిర్మొహమాటంగా తానూ మద్యానికి అలవాటు పడి పోయానని, ఒకప్పుడు విస్కీ కి బానిసయ్యానని, దానితో అనారోగ్యం పాలయ్యాక చాలా కష్టపడి దాన్నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది.

నిజమే రంగుల ప్రపంచంలో కనిపించే తారలు జీవితాలు కూడా చాలా సున్నితం. వారికీ బలహీనతలు ఉంటాయి. ఏది ఏమైనా ఈ మద్యం మత్తులో నుండి త్వరగానే మేల్కొంది శృతి అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన ఒక సినిమాలో నటిస్తోంది.