త్రిష తనలోని చెఫ్‌ను నిద్రలేపింది!?

లాక్‌డౌన్‌ కాలంలో ఇళ్లకే పరిమితమవ్వడంతో అందాల భామలు  ఇంటి పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇంటిని చక్కబెట్టడం..నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు.

ఇక నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ప్రస్తుతం ఇంట్లో వంటలు తయారు చేయడంపై  ఆసక్తి చూపు తున్నారు. ఇప్పటి వరకు వంటగది వైపు చూడని వారు సైతం గరిట చేతపట్టుకొని నలభీములుగా మారుతున్నారు. కొత్త కొత్త వంటలపై ప్రయోగాలు చేస్తూ.. వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు.  

అందాల తార త్రిష సైతం తనలోని చెఫ్‌ను నిద్రలేపి వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారు. ”లాక్‌ డౌన్‌ పూర్తయ్యేసరికి గిటార్‌ నేర్చుకుంటా” అని గిటార్‌ నేర్చుకుంటున్న ఫొటోను ఇటీవల త్రిష  షేర్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల హల్వా చేసిన త్రిష  ఇప్పుడు పిజ్జా చేసింది. అవును మరి.. చేతిలో చిత్రాలు లేకుండా పోయినప్పుడు ఎలాంటి ప్రయోగాలే చేయాలనిపిస్తుంది.