త్రివిక్ర‌మ్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేశారుగా!

హ‌ద్దుల్లో వుంటేనే అభిమానం.. అదే హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌కి తెలిసొచ్చింది. త్రివిక్ర‌మ్ రూపొందించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. బ‌న్నీ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఈ ఆదివారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే రికార్డు సృష్టించిన ఈ చిత్రం తొలి షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. త్ర‌విక్ర‌మ్ మార్కు పంచ్ డైలాగ్‌ల‌తో ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించే అవ‌కాశాలు వున్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుండ‌టంతో చిత్ర యూనిట్ దానికి మ‌రింత బూస్ట‌ప్‌నిచ్చి మ‌రింత‌గా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని సంధ్య‌ మెయిన్ థియేట‌ర్ కు చిత్ర బృందం వెల్లింది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ వ‌స్తున్నాడ‌ని తెలియ‌డంతో థియేట‌ర్ ప‌రిస‌రాల్లో భారీ క్రౌడ్ ఏర్ప‌డింది. దీంతో త్రివిక్ర‌మ్‌ని లోప‌లికి తీసుకెళ్ల‌డానికి వ్య‌క్తిగ‌త సిబ్బందికి ఇబ్బంది ఏర్ప‌డింది. ఈ క్రౌడ్‌లో త్రివిక్ర‌మ్ థియేట‌ర్లోకి వెళ్ల‌కుండా టాయిలెట్‌లోకి వెళ్లిపోయారు.

అక్క‌డి దాకా ఆయ‌న‌ని అభిమానులు వెంబ‌డించ‌డంతో త్రివిక్రమ్‌కి చిర్రెత్తుకొచ్చింద‌ట‌. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ యూట్యూబ్‌తో పాటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బాత్రూమ్‌కు కూడా వెళ్ల‌నివ్వ‌ని అభిమానం ప్ర‌మాద‌మే సుమీ అని త్రివిక్ర‌మ్ వీడియోని చూసిన వారంతా చ‌మ‌త్క‌రిస్తున్నారు.