డైరెక్టర్ మారుతి ‘బ్రాండ్ బాబు’ ఫస్ట్ లుక్ విడుదల !

బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతోపాటు  సమర్పిస్తున్నారు.

సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మురళి శర్మ  ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, పి.సాయికుమార్ నటిస్తున్నారు.

 

ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. జీవన్ బాబు (జే. బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.

 

నటీనటులు:

సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్.

 

సాంకేతిక నిపుణులు:

స్టోరి: మారుతి

డైరెక్టర్: ప్రభాకర్.పి

నిర్మాత: ఎస్. శైలేంద్ర

బ్యానర్: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్

మ్యూజిక్: జేబి

లిరిక్స్: పూర్ణచెర్రీ

కెమెరామెన్: కార్తీక్ ఫలణి

ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి

ఆర్ట్ డైరెక్టర్: మురళి ఎస్.వి

పి ఆర్ ఓ: వంశీశేఖర్