బాలీవుడ్లో కంగనా రనౌత్ ఓ ఫైర్ బ్రాండ్. గత కొంత కాలంగా కంగణ సిస్టర్స్ బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నారు. కంగనని ఎవరైనా పన్నెత్తు మాటన్నా వెంటనే రంగంలోకి దిగిపోతుంటుంది ఆమె సోదరి రంగోలి. హద్దులు దాటి మరీ కామెంట్లు చేస్తూ వుంటుంది. ఎంత పెద్ద వారు కంగనని కామెంట్ చేసినా రంగోలీ చేసే దాడికి బలైపోవాల్సిందే.
అలాంటి రంగోలీ అకౌంట్‌ని సోషల్ మీడియా ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ని విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వర్గం వారిపై రంగోలీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె అకౌంట్‌ని ట్విట్టర్ సస్పెండ్ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన కంగన దేశంలో ఏకంగా ట్విట్టర్‌ని భూస్థాపితం చేయాలని ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఓ వీడియోని విడుదల చేసింది.
ఎవరిదో వాడటం కంటే సొంతంగా స్వదేశీ సోషల్ మీడియాని ప్రారంభించండని కోరింది. దీనిపై సర్వత్రా సెటైర్లు పడుతున్నాయి. నోటిని అదుపులో పెట్టుకుని వుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదుగా అని నెటిజన్స్ కంగన సిస్టర్స్‌ని కామెంట్ చేస్తున్నారు.