టాలీవుడ్ లోకి మరో సారి  శ్రద్ధా కపూర్‌!?

ఎస్.. నిజమే  టాలీవుడ్ లోకి   శ్రద్ధా కపూర్ మరో సారి ఎంటరవుతుందట.  ఈ ఏడాది బాలీవుడ్ లో  ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’, ‘బాఘి 3’ చిత్రాలతో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే!  గత ఏడాది ‘సాహో’, ‘చిచ్చోర్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శ్రద్ధా. ఈ రెండు మంచి విజయాలను అందుకున్నాయి.
 
వరుస సినిమాలో నటిస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్న శ్రద్ధా బిజీ షెడ్యూల్‌ని ఎలా బ్యాలెన్స్‌ చేస్తుందనే విషయంపై మాట్లాడుతూ…”నిత్యం బిజీగా ఉండటం, క్రేజీ చిత్రాల్లో నటించడం హ్యాపీగా ఉంది. నేను చేసే పనిని ప్రేమిస్తాను. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పనిని పూర్తి చేస్తాను. బిజీ షెడ్యూల్స్‌ని ఈజీగానే బ్యాలెన్స్‌ చేస్తున్నా. సినీ రంగం చాలా ఎఫర్ట్‌తో కూడుకున్నది. కానీ దాన్ని ఎవరూ చూడరు. అంతిమ ఫలితమే వారికి కావాలి.  మనం చేసే పనిని ప్రేమించపోతే ఇంత ఇబ్బందిని భరించడం కష్టం. నటిని కావాలనేది నా చిన్ననాటి కోరిక. ఇప్పుడు అది నెరవేరింది. అందుకే చేసే పనిలో చిన్న విషయాన్ని కూడా ఆస్వాదిస్తున్నా” అని తెలిపింది.
 
అయితే మరో తెలుగు సినిమాలో నటించడానికి సమయాన్ని కేటాయించారట? అని అడిగితే.. ‘అవును.. మీరు విన్నది నిజమే.. కానీ ఇంకా ఆ సినిమాకు సంబంధించి చర్చల దశలోనే ఉంది.  అప్పుడే అన్ని విషయాలు చెప్పలేను అంటోంది!?