జులై 19న అమ‌లా పాల్ ‘ఆమె’ విడుద‌ల‌

అమ‌లా పాల్ కెరీర్ లో న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ‘ఆమె’. ‘ఆడై’ సినిమాకు తెలుగు వ‌ర్ష‌న్ ఇది. భిన్న‌మైన కధతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. జులై 19న ఆమె సినిమా విడుద‌ల కానుంది. ప్ర‌దీప్ కుమార్ ఆమె చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజ‌య్ కార్తిక్ ఖ‌న్న‌న్ కెమెరా
హ్యాండిల్ చేస్తున్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ ఈ చిత్ర తెలుగు హ‌క్కులను సొంతం చేసుకున్నారు. చ‌రిత్ర చిత్ర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో ‘ఆమె’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది