కరోనా వైరస్ ప్రపంచాన్ని అస్థవ్యస్తం చేస్తోంది. అక్కడా.. ఇక్కడా.. అని కాదు ఏ దేశాన్నీ వదిలిపెట్టడం లేదు. చాపకింద నీరులా ప్రతీ దేశాన్నీ చుట్టేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించేశాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతా సంఘటితం కావాలని, ఈ సమయంలో అంతా సంయమనంతో వ్యవహరించాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండు వారాల పాటు సినిమా థియేటర్స్, మాల్స్ అన్నీమూసివేయాలని ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
ఇదిలా వుంటే సినీ ఇండస్ట్రీ కూడా షూటింగ్‌లని ఆపేస్తున్నామంటూ ప్రకటించేసింది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్‌ని ఆపేస్తున్నానని, అంతా తన లాగే కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌లు ఆపేసి అంతా సహకరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఆ తరువాతే `మా` తో పాటు నిర్మాతల మండలి ముందుకొచ్చి టోటల్ షూటింగ్స్ మొత్తం ఆపేస్తున్నామంటూ ప్రకటించాయి. అయితే ఆట్ డోర్‌లో షూటింగ్ చేస్తున్న వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా వైరస్ ప్రబలుతున్న ఇటలీలో షూటింగ్ చేస్తున్న ప్రభాస్ నుంచి ఎలాంటి సందేశం రాకపోవడంతో అంతా అవాక్వుతున్నారట.
ప్రభాస్ సినిమా కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు సంమంజసం, రిలీజ్ డేట్ దగ్గరపడుతుందని, స్టార్స్ డేట్స్ అయిపోతాయని, దాంతో బడ్జెట్ పెరిగిపోతుందని ప్రాణాలని పణంగా పెట్టి షూటింగ్ కోసం ప్రమాదకరంగా మారుతున్న ప్లేస్ వెళ్లి ఇలాంటి దుస్సాహసానికి ప్రభాస్ పూనుకోవడం ఎలాంటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందోనిని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.