‘చాణక్య’ పరిస్దితి అంత దారుణమా

‘చాణక్య’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ చాణక్య. నిన్న శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్,బిలో యావరేజ్ రివ్యూ లను సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ వైజ్ గానూ బాగా డల్ గా ఉంది. భాక్సాఫీస్ వద్ద ఓపినింగ్స్ రాబట్టలేకపోయిన ఈ సినిమా , మరో ప్రక్క సూపర్ హిట్ సైరా నుంచి పోటీ ఎదుర్కొటోంది. దాంతో గోపీచంద్ పెర్ఫార్మెన్స్ కి, విజువల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా ఫలితం దక్కటం లేదు. సినిమా లో మరీ అంత విషయం లేక పోవడం తో కష్టమనిపించే పరిస్దితికి ఒక్క రోజులోనే చేరుకుంది.

ఓ ప్రక్కన సైరా, హిందీ డబ్బింగ్ చిత్రం వార్, మల్టిఫ్లెక్స్ లలో హాలీవుడ్ చిత్రం జోకర్ ఈ సినిమాకు డైరక్ట్ గా ఎటాక్ ఇస్తున్నాయి.  దాంతో పండగ రోజులను కూడా క్యాష్ చేసుకోలని పరిస్దితిలో ఉంది. 11 కోట్లు దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం డిజాస్టర్ గానే ట్రేడ్ లో అంచనా వేస్తున్నారు. మొదటి రోజు 1.2 కోట్లు తెచ్చుకున్న ఈ సినిమా ఎట్టిపరిస్దితుల్లోనూ మినిమం కలెక్ట్ చేయలేదని లెక్క వేసి చెప్తున్నారు. గోపీచంద్ కెరీర్ లోనే పెద్ద ప్లాఫ్ గా టర్న్ అవుతుందని అంటున్నారు.

గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య . ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. గోపీచంద్ మొదటిసారి అండర్ కవర్ రా ఏజెంట్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహ్రిన్ నటించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పంతం చిత్రం రావడం జరిగింది. జరీన్ ఖాన్ మరో హీరోయిన్ గా నటించగా సునీల్, అలీ, నాజర్, ఆదర్శ్, రాజా చెంబూరు ఇతర పాత్రలో కనిపించారు.