చరణ్ కు బండ్ల గణేష్ ట్వీట్ గాలం, తగులుతుందా?

బండ్ల గణేష్ మళ్లీ వచ్చాడురోయ్

సినిమాల్లో రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఓడి, తను గెలిచిన సిని పరిశ్రమకు మళ్లీ వెనక్కి వచ్చారు బండ్ల గణేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరులో ఓ హాస్ పాత్ర చేస్తున్న ఆయన మళ్లీ నిర్మాతగానూ బిజి అవ్వాలనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్దాయి హీరోలతో చేసిన నిర్మాతగా చిన్న హీరోలతో చెయ్యలేరు కాబట్టి మళ్లీ పెద్ద హీరోలనే ట్రై చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రామ్ చరణ్ కు ఓ ట్రైల్ వేస్తున్నట్లు చెప్తున్నారు.

ఇక మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తను నిర్మాతగా చేసిన సైరా న‌ర‌సింహారెడ్డి విజ‌యోత్స‌వంలో ఉన్నారు. ఫ్యాన్స్ తో ఫ్యామిలీతో ఆ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నాడు. తన రెండున్న‌రేళ్ల క‌ష్టానికి త‌గ్గ ఫ‌లిత ద‌క్కింద‌ని ఆయన చెప్తున్నారు. అయితే అదే సమయంలో తను రామ్ చ‌ర‌ణ్ డేట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నానంటూ నిర్మాత బండ్ల గ‌ణేష్ ఓ ట్వీట్ చేసారు. లిటిల్ బాస్ తో సినిమా చేయ‌డం కోసం రెడీ గా ఉన్నా. చిన్న బాస్ ఎప్పుడు క‌రుణిస్తాడో అంటూ ఓ ట్వీట్ పెట్టాడు. దాంతో ఇప్పుడీ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ పై చ‌ర‌ణ్ స్పందిస్తాడో లేదో చూడాలంటున్నారు మీడియా జనం.

బండ్ల గణేష్ గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీన్ మార్, గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాలు నిర్మించాడు. తీన్ మార్ ప్లాప్ అవ్వ‌డంతో ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ తో గ‌ణేష్ కి భారీ విజ‌యాన్ని అందించాడు. ఆ తర్వాత రామ్ చ‌ర‌ణ్ తో గోవిందుడు అంద‌రివాడే నిర్మించాడు. కానీ ఆ సినిమా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దాంతో ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తో సినిమా చేసి హిట్ కొట్టాలనుకుంటున్నాడు.