‘గ‌జ‌దొంగ‌`గా స‌ప్త‌గిరి

`స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌`, `స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి` చిత్రాల‌తో హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన శైలిని, మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు టాప్ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి. ఆయ‌న హీరోగా `గ‌జ‌దొంగ‌` పేరుతో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది. నంద నంద‌నా ప్రాజెక్ట్స్ ప‌తాకంపై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి  చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. గీతా ఆర్ట్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ‌ల్లో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన డి.రామ‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి మాట్లాడుతూ “ స‌ప్త‌గిరికి యాప్ట్ స‌బ్జెక్ట్ ఇది. స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఆశించే అంశాల‌న్నీ ఇందులో పుష్క‌లంగా ఉంటాయి. మ‌హాన‌టుడు ఎన్టీఆర్ న‌టించిన `గ‌జ‌దొంగ‌`కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో స‌ప్త‌గిరిది దొంగ‌ల‌కు దొంగ‌లాంటి పాత్ర‌. అస‌లు సిస‌లు దొంగ‌ల్ని దోచుకుని స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. విలేజ్‌, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఆగ‌స్టు తొలి వారంలో చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తాం“ అని తెలిపారు.

ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: ప‌్ర‌వీణ్‌ వనమాలి, సంగీతం:బుల్గానిన్, ఆర్ట్ : వ‌ర్మ‌,మూల కథ-రచనా సహకారం: G.T.R. మహేంద్ర, P.V.సతీష్, లైన్ ప్రొడ్యూసర్:R.V.V.V.ప్రసాద్, నిర్మాత‌లు:  శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర ,G .V .N .రెడ్డి  , కథ-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:  డి.రామ‌కృష్ణ‌.