వరస ఫ్లాఫ్ లే..కానీ గ్యాప్ లేకుండా సినిమాలు
గోపీచంద్ హిట్ అనేది చూసి చాలా కాలం అయ్యింది. అయినా వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. మంచి ఫామ్ లో ఉన్నాడు. పెద్ద బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. రవితేజ లాగే ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. దాంతో అసలేం జరుగుతోంది..గోపిచంద్ ఎలా చెయ్యగలుగుతున్నాడు ఇన్ని సినిమాలు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇండస్ట్రీలో. ఇప్పుడు చేస్తున్న చాణుక్య సినిమాకు మినిమం హైప్ లేకపోయినా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇదెలా సాధ్యం..హౌ..
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గోపీచంద్ ..కు ఉన్న పరిచయాలే సినిమాలు తెచ్చిపెడుతున్నాయి. రెండు అతనికి మిగతా హీరోలతో ఉన్న ఫ్రెండ్లీ నేచర్ తో వాళ్లు రికమెండ్ చేస్తున్నారు. అలాగే గోపీచంద్ సినిమాలకు హిందీ శాటిలైట్ మార్కెట్ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఉంది.
ఇక ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు డేట్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చూంటే కాలం ఖర్చవటం తప్ప పెద్దగా ఫలితం లేదని నిర్మాతలు భావించి గోపిచంద్ లాంటి మినిమం హీరో కోసం ట్రై చేస్తూంటారు. అది కలిసి వస్తోంది. ఫైనల్ గా గోపిచంద్ ..రెమ్యునేషన్ విషయంలో పట్టుబట్టడు. కొంచెం అటూ ఇటూలో పోనిస్తాడు. ముందు తను లైమ్ లైట్ లో ఉండటం ముఖ్యం అనుకుంటాడు. ఇవన్నీ గోపిచంద్ కు వరస సినిమా ఆఫర్స్ కు కారణమవుతున్నాయంటున్నారు.
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘చాణక్య’ చిత్రం రూపొందింది. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ‘తిరు’ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో గోపీచంద్ .. ‘రామకృష్ణ’ అనే బ్యాంకు ఉద్యోగిగా, ‘అర్జున్’ అనే RAW ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. ఇది ‘కరాచీ’ నేపథ్యంలో మాఫియా చుట్టూ అల్లుకున్న కథ అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. జరీన్ ఖాన్ .. రాజేశ్ ఖట్టర్ .. అరుణ్ కుమార్ కనిపిస్తున్నారు. భారీస్థాయిలో నిర్మితమైన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.