చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. దీని ధాటికి చిన్నా పెద్దా, స్టార్..కామన్ మ్యాన్ అని తేడా లేకుండా అంతా భయంతో వణికిపోతున్నారు. బయటికి రావాలంటేనే బిక్కు బిక్కు మంటున్నారు. ఒక వేళ బయటికి రావాల్సిన పరిస్థితులు ఎదురైనా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఎంత త్వరగా ఇంటికి దారి పట్టాలిరా దేవుడా అంటూ పరుగులు తీస్తున్నారు. పరిస్థితి మరీ భీతావహంగా మారడంతో ప్రపంచ దేశాలన్నీ కరోనాపై హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. రెండు వారాల పాటు సమస్థం బంద్ చేయాలని ఆర్డర్‌లు పాస్ చేశాయి.
జనం అంతా భయంతో వణికి పోతూ ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో నని భయంతో చచ్చిపోతుంటో ఒక్కడు మాత్రం కరోనా వైరస్‌కే తాతయ్యలా తయారయ్యాడు. యూట్యూబ్‌లో తలతిక్క సమాధానాలతో స్టార్స్‌ని, స్టార్ హీరోయిన్స్ తన టాపిక్‌లోకి లాగుతూ భలే ఎంటర్‌టైన్‌మెంట్‌ని పండిస్తున్నాడు. అయితే వాడు పిచ్చోడా? లేక మెంటల్‌గా చిప్ ఏమైనా దొబ్బిందా అని అంతా వాడి సమాధానాలు విని అవాక్కవుతున్నారు. ఆ తలతిక్క మనిషి పేరు సునిషిత్. తను తమన్నాని, లావణ్య త్రిపాఠిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నానని, నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే చిత్రాలు తాను చేయాల్సిన వని సుకుమార్ బ్రతిమాలితే నాన్నకు ప్రేమతో, నేనొక్కడినే చిత్రాలని త్యాగం చేశానని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. కరోనా కే వీడు తాతయ్యలా వున్నాడే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ జోకులు పేలుస్తున్నారు.