కరోనా ప్రతీ ఒక్కరికీ సరికొత్త పాఠాలు నేర్పుతోంది. దూరం పాటిస్తూనే ఎలా జీవించాలో నేర్పుతోంది. అంతేనా చాలా చిత్రాలే చూపిస్తోంది. లాక్‌డౌన్ కావడంతో ఒకరి ఇంటికి ఒకరు..ఒకరి ఆఫీస్‌కి మరొకరు వెళ్ల కూడని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రకటించాయి కూడా.
దీంతో ఎక్కడి వారు అక్కడే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇది సినిమా వాళ్లకు శాపంగా మారినా టెక్నాలజీతో తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఇండియన్ సూపర్‌స్టార్స్ అంతా కలిసి ` ఫ్యామిలీ` పేరుతో ఎలాంటి టెక్నీషియన్స్ లేకుండా ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి షార్ట్ ఫిల్మ్ ని ఎక్కడి వవారు అక్కడే వుండి రూపొందించిన విషయం తెలిసిందే.
ఇప్పడు ఓ స్టార్ హీరోకు స్టార్ డైరెక్టర్ తన ఇంటి నుంచే స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నాడు. అదీ టెక్నాలజీ సహాయంతో. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కలయికలో ఓ భారీ చిత్రం తెరపైకి రానున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రం రూపొందునున్న ఈ చిత్ర కథలోని సన్నివేశాల్ని చేయాల్సిన మార్పుల్ని త్రివిక్రమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడిస్తున్నాడట. టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో ఈ తరహాలో కథ వినడం ఇదే మొట్టమొదటిసారి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.