కరోనాపై యుద్ధానికి దేశం మొత్తం సిద్ధమవుతోంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు అన్ని రంగాలు చేయి చేయి కలుపుతున్నాయి. లాభాల్ని మాత్రమే లెక్కచేసే కార్పొరేట్ కంపనీలు సైతం వైద్య పరికరాల్ని ఊహించని స్థాయి రేటుకి విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ దండు మేము సైతం అంటూ ముందుకొచ్చింది.
ఇందుకు నితిన్ ముందుగా స్పందించి 20 లక్షలు ప్రకటించడంతో ఈ విరాళాల పరంపర మొదలైంది. ఆ వెంటనే జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 2 కోట్లు ప్రకటించాడు. ఆ తరువాత రామ్‌చరణ్ 70 లక్షలు, ఆ వెంటనే త్రివిక్రమ్ 20 లక్షలు, కొరటాల 10 లక్షలు, అనిల్ రావిపూడి 10 లక్షలు, మహేష్ బాబు కోటి ఉభయ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రభాస్ కోటి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 75 లక్షలు, దిల్ రాజు 20 లక్షలు, సాయితేజ్ 10 లక్షలు విరాళం ప్రకటించారు. ఇక అల్లరి నరేష్ తన చిత్రానికి వర్క్ చేస్తున్న 50 మంది డైలీ వర్కర్‌లకు ఒక్కోక్కరికి 10 వేలు అందజేశారు. ఇలా ఓ దండులా కరోనాపై పరోక్షంగా యుద్ధానికి సిద్ధమయ్యారు. దీంతో సినీ సెలబ్రిటీలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.