ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వైరస్ కరోనా.. ప్రపంచం మొత్తంలో దీని భారి నుంచి తప్పుంచుకోని దేశం అంటూ లేదు. ఒక్క క్యూబా తప్ప. మన దేశంలో దీని అలజడి ఇప్పుడిప్పుడే మొదలైంది. వేళల్లో కేసులు మొదలయ్యాయి. వందల్లో మరణాలు సంభవించే ప్రమాదం వుండటంతో ప్రధాని మోదీ వెంటనే తేరుకుని దేశం యొత్తం లాక్ డౌన్ విధించారు.
21 డేస్ లాక్ డౌన్ కారణంగా కరోనా చైన్‌ని తెంపొచ్చనేది ప్రధాన నమ్మకం. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం కూడా పైగా మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ కూడా అదే కావడంతో లాక్ డౌన్ విధించక తప్పలేదు. అయినా కరోనా కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సినీ ప్రముఖులు పాటల్ని సిద్ధం చేస్తున్నారు.
ఇటీవల కోటీ ఐదుగురు హీరోలతో కరోనా మహమ్మారిపై ఓ పాటని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కీరవాణి కూడా ఓ పాటని మంగళవారం విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గరి నుంచి వార్త ఛానళ్లని మించి రామ్‌గోపాల్‌వర్మ కరోనాపై ట్వీట్‌లు చేస్తూనే వున్నాడు. తాజాగా తానే స్వయంగా రచయితగా, గాయకుడిగా, నటుడిగా మారి కరోనా మహమ్మారిపై ఓ వీడియో సాంగ్‌ని సిద్ధం చేశాడు.
`కనిపించని పురుగు కరోనా.. `అంటూ ఓ వీడియో గీతాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసిన రామ్‌గోపాల్‌వర్మ పూర్తి పాటని మాత్రం సాయంత్రం రిలీజ్ చేస్తానంటున్నాడు. అయితే ఈ పాటని వినే ముందు మాత్రం చేతులు కడుక్కుని వినండని ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేస్తున్నాడు. వర్మ రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పాటు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.