క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా?

బాలీవుడ్ చిత్రం `ద‌స్త‌క్‌` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్‌. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. న‌ట‌న రాద‌ని విమర్శ‌లు వినినించాయి. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా కెరీర్‌ని ఎక్క‌డా సిరియ‌స్‌గా తీసుకున్న‌ట్టుగా అనిపించ‌లేదు. దాంతో సుస్మితకు న‌టిగా పెద్ద‌గా గుర్తింపు రాలేదు కానీ వివాదాస్ప‌ద నిర్ణయాల‌తో మాత్రం పాపుల‌ర్ అయిపోయింది.

వివాహం చేసుకోకుండా ఇద్ద‌రు అమ్మాయిల్ని ద‌త్త‌త తీసుకున్న సుస్మిత త‌న‌ కంటే చిన్నవాడైన బిజినెస్‌మేన్ రోమన్ షావ‌ల్‌తో గ‌త కొంత కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తోంది. పెళ్లి వ‌ద్దు స‌హ‌జీవ‌నమే ముద్దు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఇద్ద‌రు అమ్మాలు, త‌న ప్రియుడితో క‌లిసి ఒకే ఇంట్లో వుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించ‌డంతో అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు.

ప్రియుడు ఇంట్లోనే వుండ‌టంతో అత‌నితో క‌లిసి హాట్ యోగా చేస్తూ ఆ ఫొటోల్ని, వీడియోని త‌న అభిమానుల కోసం సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ఇదిలా వుంటే తాజాగా మ‌రో హాట్ ఫొటోని సుస్మిత షేర్ చేసింది. గ‌తంతో పోలిస్తే అందాల‌ని ఆర‌బోస్తూ రెడ్ డ్రెస్‌లో ఫొటోకు పోజులిచ్చింది. ఈ ఫొటో కూడా వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్స్ క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా? అని అవాక్క‌వుతున్నారు.