ఇంటి పట్టునే వుండండి.. సేఫ్‌గా వుండండి.. అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఇప్పటికీ చాలా మంది వినడం లేదు. ఇళ్లల్లో వుండండి అంటే చిత్ర విచిత్రమైన సాకులు చెబుతూ బయటికి వచ్చేస్తున్నారు. అయితే సెలబ్రిటీలు, సామాన్యులు చాలా వరబయటికి రావడం లేదు. సీరియస్‌గా లాక్‌డౌన్ నియమనిబంధనల్ని పాటిస్తూ ఇంటిపట్టునే వుంటున్నారు.
అలా ఇంటి పట్టునే వుంటోంది పాయల్ రాజ్‌పుత్. కానీ ఈ మధ్య తనకి ఇంట్లో వుండటం బోర్ కొడుతోందట. చిరాకేస్తోందట. దాంతో చిత్ర విచిత్రమైన ఫీట్‌లు చేస్తోంది. ఆ మధ్య క్వారెంటైన్ టైమ్ బోర్‌గా వుందని ఏడ్చేసి షాకిచ్చిన పాయల్.. తాజాగా వెరైటీ ఫీట్‌తో నెటిజన్స్‌కి షాకిచ్చింది. ఇన్ని రోజులు ఇంటిపట్టునే వుండటం తనకు నచ్చడం లేదని చాలా బోర్‌గా వుందని పాయల్ బోర్‌మంటోంది.
ఈ బోరింగ్ టైమ్ నుంచి రిలాక్స్ కోసం ఎల్లో పిల్లోనే తన డ్రెస్‌గా మార్చేసింది. ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసి క్వారెంటైన్ టైమ్ బోర్ గా వుందని, పిల్లోని ఫేషన్‌గా వాడండని సలహా ఇస్తోంది.